ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ అత్యుత్తమ పనితీరుకు గాను జాతీయ ఖనిజ వికాస్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కింద ఖనిజాల అన్వేషణ, వేలం, గనుల నిర్వహణలో అత్యుత్తమ విధానాలను అనుసరించినందుకు గాను కేంద్ర గనుల శాఖ ఏపీకి రూ.2.4 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అవార్డులను అందజేశారు.