పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన నిరాడంబరతను మరోసారి బయటపెట్టారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్కు వచ్చిన కొందరు టూరిస్టులను ఆమె ఆశ్చర్యపరిచారు. మంగళవారం అటుగా వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కనే తన కాన్వాయ్ ఆపారు. దుకాణంలోకి వెళ్లి కొందరు టూరిస్టులకు స్వయంగా పానీపూరి చేసి ఇచ్చారు. సీఎం చర్యతో టూరిస్టులు సంతోషంలో మునిగిపోయారు. గతంలోనూ ఆమె ఇదే తరహాలో మోమోలు చేశారు.