రాష్ట్రంలో దొరుకుతున్న, అమ్మబడుతున్న మద్యం సరైన క్వాలిటీ లేదు అనుకుంటున్నారో, లేక ధరలు ఎక్కువ భావిస్తున్నారో కానీ మందు బాబులు మాత్రం ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. పోలీస్ ఎంత పహారా కాసిన , వారు ఏదో ఒక దారి నుండి రాష్ట్రము లోకి మద్యాన్ని తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో 2018 సం. నుండి 2022సం. జూన్ వరకు 1151 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.35,64,491/-ల విలువగల 22,722 బాటిల్స్ అక్రమ మద్యంను ఎచ్చెర్ల ఏ.ఆర్. మైదానంలో ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS పర్యవేక్షణలో ధ్వంసం చేయడం జరిగింది.