స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలు చేయడం చూశాం కానీ ఎన్నికలై చాలా రోజులైనా టిడిపికి ఓట్లు వేశారని, మద్దతు పలికారనే కక్షతో ఇప్పటికీ వైసీపీ నేతలు నానా ఇబ్బందులకి గురిచేస్తూనే వున్నారు అని ఆరోపిస్తున్నారు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్. వివరాల్లోకి వెళితే.... ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగ పెంట గ్రామంలో మర్రి శ్రీను అనే మేకల కాపరి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటేసి తన ఓటమి కారణం అయ్యాడనే కక్షతో వారి ఇంటినే కబ్జా చేశాడు వైసీపీ నేత పోలయ్య. అధికారం అండతో వైసీపీ నేత పోలయ్య ఏకంగా ఇల్లు ఆక్రమించేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది అని తెలియజేసారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డి గారూ! ప్రజలు తిరగబడకముందే ఇటువంటి కబ్జాలు, అరాచకాలు మానండి అని హెచ్చరించారు.