రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రక్రియలో వైసీపీ పార్టీ తమ మద్దతుని ఎప్పుడో తెలియజేసింది. అలానే తాజాగా మంగళవారం టీడీపీ పార్టీ కూడా తమ మద్దతు మీకే అంటూ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ,ఆమెను ఘనంగా సన్మానించింది.ఎమ్మెల్యేగా,మంత్రిగా,గవర్నర్ గా విశేష సేవలు అందించిన ముర్ము గారిని టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa