సామర్లకోట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ప్రత్యక్షంగా సందర్శించి పలు సూచనలు చేసిన కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో సామర్లకోట గ్రామ శివారున పిఠాపురం వైపు వెళ్ళు రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర వర్షం కారణంగా కాలువ నీరు ఉధృతంగా రోడ్డుపై ప్రవహిస్తూ రాకపోకలకు ప్రమాదకరంగా ఉండటంలో, అటువైపు ఎవరు వెళ్ళకుండా భద్రతా చర్యలలో భాగంగా పోలీసు వారిచే ఏర్పాటు చేసిన పికెట్ ను జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS ప్రత్యక్షంగా పరిశీలించి, నీటి ఉధృతి తగ్గే వరకు ప్రజలు అటువైపు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని, పికెట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఏ విధమైన అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సామర్లకోట SI & పెద్దాపురం CI లకు ఆదేశాలు జారీ చేసారు.