పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి తక్షణమే సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేసారు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడవద్దని ప్రభుత్వానికి గుర్తుచేస్తూ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన నగరాల్లో చెత్త పేరుకుపోయి వర్షాకాలంలో అనేక రకాల విష జ్వరాలు, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తక్షణమే కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.