శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే బుధవారం దేశం విడిచి, మాల్దీవులకు చేరుకున్నారు. తన కుటుంబం దేశం నుండి సురక్షితంగా నిష్క్రమించే వరకు రాజీనామా చేయనని మంగళవారం పేర్కొన్నాడు. అతని సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స కూడా దేశం విడిచి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే అధ్యక్ష పదవికి బుధవారం నాటికి గొటబయ రాజీనామా చేస్తారని ఇటీవల స్పీకర్ ప్రకటించారు. దానిపై గొటబయ స్పష్టతనివ్వలేదు.