ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 18 తేదీన రాష్ట్రపతి ఎన్నికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 12:04 PM

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొదటి ప్రభుత్వం మనదేనని, అందులో భాగంగా మరో అడుగు ముందుకువేస్తూ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌ హాల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ పార్టీ ప్రజాప్రతినిధులను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి పరిచయం చేశారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు,  ఎంపీలు అందరూ పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. ఈనెల 18 తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఓటు వేయడానికి తీసుకువచ్చే బాధ్యత విప్‌లు తీసుకోవాలన్నారు. 18వ తేదీన ఉదయం మాక్‌ పోలింగ్‌ చేసిన తరువాత ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com