రేప్ కేసు దోషులకు 'కెమికల్ కాస్ట్రేషన్'కు గురిచేసే చట్టానికి థాయిలాండ్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టెస్టోస్టిరాన్, లైంగిక స్థాయి తగ్గించేలా ఇంజెక్షన్లు ఇస్తారు. సైకియాట్రిక్, మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదం, నేరస్థుడి అనుమతితో ఈ పక్రియ చేపట్టాలి. చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గిస్తారు. ఈ శిక్ష సౌత్ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని 8 రాష్ట్రాల‍్లో అమలవుతుంది.