13-07-2022 బుధవారం రోజున జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు ట్రాక్టర్ ప్రమాదానికి గురై అకాల మరణం పొందిన నీలాద్రిరావుపేట గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికుడు ఆచంటి సూరిబాబు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి జనసేన పార్టీ ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయల భీమా చెక్కును అందజేయడానికి వస్తున్నట్లు స్థానిక జనసేన నాయకులూ తెర్లియజేసారు. ఈ సందర్భంగా జనసైనికులు అంతా మధ్యాహ్నం 2 గంటలకు పెద్ద ఎత్తున నీలాద్రిరావుపేట గ్రామం తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అని జగ్గంపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ , పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు.