కేరళలోని తిరువనంతపురంలో యావజ్జీవ ఖైదీ సుభాశ్ మంగళవారం జైలు నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో దగ్గరలోని ఓ చెట్టు ఎక్కేశాడు. పోలీసులు తరుముతున్నారనే కంగారులో చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయాడు.
పోలీసులు గంటన్నర పాటు అతడిని కిందికి దిగాలని నచ్చజెప్పినా ఆ ఖైదీ మాట వినలేదు. చివరికి ఇరుక్కుపోయిన అతడు కొమ్మలు విరగడంతో కింద పడ్డాడు. అప్పటికే పోలీసులు వల సిద్ధంగా పట్టుకోవడంతో అతడి ప్రాణాలు దక్కాయి.