ఒడిశాలో విద్యార్థులు చదువుకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్లో ఓ నదిపై వంతెన లేకపోవడంతో రోజూ నదిలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు నదిని దాటడం కష్టంగా మారింది. పాఠశాలకు వెళ్లేందుకు రెండు వైపులా తాడును కట్టి అతి కష్టంగా నదిని దాటుతున్నారు. అక్కడ వంతెన లేకపోవడం వల్ల 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.