శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే కుటుంబ సభ్యులతో సహా మాల్దీవులకు పారిపోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు పైకి వచ్చారు.
పోలీసుల వాహనాలపై రాళ్ల దాడి చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు.