శ్రీలంకలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సేను దేశం దాటించడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ప్రజలు నేరుగా బుధవారం ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసాన్ని ముట్టడించారు. ఆర్మీ మోహరించినా, వేల సంఖ్యలో ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి చొరబడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనకడుగు వేయడం లేదు.