ఆత్మవిశ్వాసంతో బతకడమే అసలైన మార్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంక్షేమ ప్రభుత్వం ఇది అని, అంతా ఆశీర్వదించాలని ఆయన కోరారు. సింగుపురం- 2 గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు.. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన కొన్ని స్థానిక సమస్యలను విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త భవనం ఏర్పాటు, ప్రారంభం అన్నవి తనకెంతో ఆనందంగా ఉన్నాయని అన్నారు. మంచి కార్యాలయం ఉండడం వల్ల ప్రజలకే కాకుండా పనిచేసే వారికి కూడా ఓ మంచి వాతావరణంలో ఉండడం వల్ల, ఆయా వ్యక్తుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఆ విధంగా ఉండడం వల్ల ఆ అధికారి, ఆ ఉద్యోగి మరింత సమర్థంగా పనిచేయడం సాధ్యం అవుతుందని అన్నారు.