ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 02:53 PM

ఒంగోలు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో  జరిగిన విలేకరుల సమావేశంలో  పోతుల సురేష్‌ మాట్లాడుతూ .........  చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్‌ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు.  బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్‌ అంబాసిడర్ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com