ఉత్తరప్రదేశ్ లో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల ద్వారా కూల్చివేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల తర్వాత యూపీలోని పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. వీటికి కారణమైన వారి ఇళ్లను ప్రభుత్వం అక్రమంగా కూల్చేస్తోందంటూ జమాతే ఉలేమా ఇ హింద్ పిల్ వేసింది. బుధవారం దీన్ని వ్యతిరేకిస్తూ చట్టబద్ధంగానే కూల్చివేస్తున్నట్టు యోగి ప్రభుత్వం తెలిపింది.