తమిళనాడు మంత్రి రామచంద్రన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో తన సమస్య చెప్పుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అయితే సమస్యను వినకుండా ఆ మహిళను మంత్రి చెంపపై కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆ వీడియోను బీజేపీ విడుదల చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. మంత్రి రాజీనామా చేయాలని చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.