తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ సాయం చేస్తోంది. గతంలో కూడా భారత్ లంకకు అనేక రకాలుగా సాయం చేసింది. తాజాగా ఆ దేశ విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా భారత్ సాయం చేస్తోంది. భారత్లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలు శ్రీలంకకు తోడ్పడుతున్నాయి. లంక విమానాలకు ఇంధనాన్ని నింపుకునేందుకు కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలు అవకాశం కల్పిస్తున్నాయి.