ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులకు పరిహారం ఇవ్వడం లేదంటూ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదని, పవన్ కల్యాణ్ కు క్యారెక్టర్ లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్రాప్ హాలిడే ఎక్కడా లేదని బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు.