టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ తెలిపింది. నగదు చెల్లింపులకు స్వస్థిపలికి ఈ యూపీఐ పేమెంట్ల విధానాన్ని అందుబాటులోకి తెస్తే భక్తులకు మేలు జరుగుతుంది. ముందుగా ఈ విధానాన్ని వసతి గదులు కేటాయింపుల్లో అమలు చేయనున్నారు. అక్కడ విజయవంతం అయితే అన్నిచోట్లా కూడా యూపీఐ పేమెంట్ల విధానాన్నే అమలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa