శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ్ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పరిస్థితి చక్కదిద్దాలని ఆర్మీ, నేవీ భద్రత అధికారులకు పూర్తి అధికారాలను ఇచ్చారు. దీంతో కనిపిస్తే కాల్చివేతకు లంక సైన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.