శ్రీలంకలో దిగాల్సిన విమానాలు కాస్త కేరళ రాష్ట్రంలోని ఎయిర్ పోర్ట్ ల్లో ల్యాండ్ అయ్యాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోగా, దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలను కేరళకు మళ్లించారు. ఈ విమానాలు కేరళలోని తిరువనంతపురం, కొచ్చి ఎయిర్ పోర్టుల్లో ల్యాండయ్యాయి.
ఇదిలావుటే దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల సిబ్బందిని అభినందించారు. 120కి పైగా విమానాలను టెక్నికల్ ల్యాండింగ్ కు అనుమతించడం ద్వారా తమ విధులకు మించిన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు. పొరుగుదేశంతో మన సంబంధాల బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని సింథియా అభిప్రాయపడ్డారు.