ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడికోట శ్రీకాంత్ రెడ్డికి కేబినేట్ హోదా..రెండేళ్ల వరకు వర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 09:23 PM

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ హోదా కల్పించింది. ఆయన్ని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు. దీంతోపాటు ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఈ క్యాబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. శ్రీకాంత్ రెడ్డి... సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల నూతన మంత్రివర్గంలో ఆయనకు తప్పకుండా స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com