ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు. ఈ పోస్టుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ రెడ్డి కేబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించనందునే శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించినట్లు తెలుస్తోంది.