అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఇటీవల ఎన్నికైన సంగతి తెలిసిందే. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్, జయలలిత కాలంలో కూడా పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని పళనిస్వామి అన్నారు.