శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పొరుగుదేశంలోనూ నిరసన తెగ తప్పలేదు. మాల్దీవులకు పారిపోయిన గొటబాయకు వ్యతిరేకంగా మాలే నగరంలో శ్రీలంక జాతీయులు వారి జాతీయ పతాకం పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజపక్సను తిరిగి శ్రీలంకకు పంపించివేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని మాల్దీవ్స్ నేషనల్ పార్టీ నేత దున్యా మౌమూన్ స్పష్టం చేశారు.