పలమనేరు నియోజకవర్గం వీకొటలో జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పలమనేరు నుంచి కుప్పం వరకు గల జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు. ప్రమాదకర మలుపుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచనలు చేశారు.