పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం రెవెన్యూ పరిధిలో పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో కొల్లగొడుతున్న మట్టి మాఫియా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కను సైగల్లో నడుస్తుంది అని స్థానిక టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు.ఇంతగా గ్రావెల్ మాఫియా జరుగుతుంటే మండల రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వివరించాలి? అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ మాఫియా దందా నిర్వహిస్తున్న నరసరావుపేట ఎమ్మెల్యే పై కూడా అధికారులు విచారణ చేపట్టాలి లేకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు. అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అధికారం ఎవరి సొత్తు కాదు అధికార పార్టీకి మీరు తొత్తుగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa