రాజోలునియోజకవర్గం మలికిపురం నుంచి విశ్వేశ్వరపురం వేళ్ళే ప్రధాన రహదారి గుంత గుంతలుగా ఉన్నాయని జనసేన తరఫున గలాన్ని వినిపించి వీడియో రూపంలో జనసేన నాయకులూ పోస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు ఈరోజున రొడ్డు మరమత్తు పనులు మొదలుపెట్టారు. స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన అధికారులు అందరికీ జనసేన తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా త్వరలోనే తీసుకొస్తారని, ఇది జనసేన విజయం అని , ప్రతి ఒక్క జనసేనకుడు మీ గలాన్ని బలంగా వినిపించి జనసేనాని ఆశయ సిద్ధాంతాలకు తోడుగా మన వంతు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.