2022-23 సంవత్సరానికి గాను వైఎస్సార్ వాహనమిత్ర డబ్బులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. రేపు విశాఖలో జరిగే కార్యక్రమంలో 2,61,516 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను జమ చేయనున్నారు. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. నాలుగేళ్లలో ఈ పథకం కింద మొత్తం రూ.1,025.96 కోట్లు అందించారు.