మనిషి ఎదుగుదలలో గురువు పాత్ర కీలకం. తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానానికి తగిన వ్యక్తి గురువు మాత్రమే, గురువులకు ఎల్లప్పుడు అందరం గౌరవం అందించాలి అని నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలియజేసారు. బుధవారం గురు పూర్ణమి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట పట్టణంలో స్థానిక సత్తెనపల్లి రైడ్లో ఉన్న షిర్డీ సాయి బాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాను. నియోజకవర్గంలో ప్రజలంతా శాంతియూతంగా ఉంటూ, ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు మంచి చదువులతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని,మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని,పర్యావరణ సంరక్షణకు,పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి అని పిలుపునిచ్చారు.