ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు , బాదుడే బాదుడు కార్యక్రమంలో రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో జోరు వాన ను సైతం లెక్కచెయ్యకుండా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్న అధిక ధరల భారాన్ని, పన్నుల భారాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. గ్రామంలో సమస్యల గురించి తెలుసుకునే క్రమంలో గ్రామస్తులు సీసీ రోడ్లు,డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరడం జరిగింది.టీడీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తోందని భరోసా ఇవ్వడం జరిగింది.