రాష్ట్రంలో జై టాక్స్ రూపంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,నియోజకవర్గంలో జీ టాక్స్ రూపంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పేద, మధ్య తరగతి,సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో ప్రజా చైతన్య యాత్రలోని భాగంగా గ్రామ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో బాదుడే.. బాదుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు పాల్గొని, గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి అధికారం చేపట్టినప్పటి నుండి గ్రామంలో అభివృద్ధి పనులు సమస్యలుగానే మిగిలిపోయాయి అని ఆవేదన వ్యక్తపరిచారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి లోకి తీసుకువెళ్తాము అని హామీ ఇచ్చారు.