వైద్యరంగంలోనే సంచలనం సృష్టించారు ఇజ్రాయెల్ పరిశోధకులు. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం HIVకి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి రికార్డులకెక్కారు. పరిశోధనలో భాగంగా HIVని అడ్డుకోగలిగే రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపచేసే టైప్-బీ తెల్ల రక్తకణాలను పలు మార్పులకు గురిచేసి పరిశోధకులు యాంటీబాడీలను తయారుచేయగలిగారు. ఈ మేరకు భవిష్యత్తులో AIDSకు మందులు ఉత్పత్తి చేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.