ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణించవలసి వస్తోంది. అయినా జగన్ రెడ్డిలో కాస్తంత కూడా చలనం లేదు. అందుకే తెలుగుదేశం "చెత్త రోడ్లు - చెత్త ముఖ్యమంత్రి" కార్యక్రమం చేపట్టింది అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ... మీ రోడ్డు బాగుపడాలనుంటే మీరు చేయవలసిందల్లా మీకు కనిపించిన చెత్త రోడ్డును సెల్ఫీ కానీ, ఫోటో, వీడియో రూపంలో కానీ 7557557744 నంబర్ కు పంపించండి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెద్దాం. మన రోడ్డును బాగు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి అంటూ ప్రజల్లోకి సంకేతాలు పంపించారు.