ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిద్దరు...ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యం: మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 02:53 PM

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రలో ఉండటం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యమని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి సిగ్గుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నారు. రెండుచోట్లా ఓడిన వ్యక్తి మాటలకు విలువ ఇస్తున్నారంటే.. లేనిపోని ప్రాచుర్యం కల్పిస్తున్నారంటే.. ఈ ప్రభుత్వంపై కుట్ర చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దత్తపుత్రుడు రైతులకు పరిహారం సరిగ్గా చెల్లించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకైనా.. పంట సాగుదారు హక్కుపత్రం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ కౌలురైతుకైనా రూ.7లక్షల చొప్పున పరిహారం అందలేదని రుజువు చేయగలరా అంటూ సవాల్ విసిరారు.


ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని రాసినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను మార్చలేరన్నారు. ప్రజలు జగన్‌ పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారో మొన్న జరిగిన ప్లీనరీలో తేలిసిపోయిందని.. జనం జగన్‌ వెంటే ఉన్నారని ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు.. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌కు క్యారెక్టర్‌ లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న మంచి కార్యక్రమాలపై టీడీపీ అనుకూల మీడియా రాయదని.. రెండు చోట్ల చిత్తుగా ఓడిన దత్తపుత్రుడి మాటలకు విలువ ఇస్తుందని విమర్శించారు. నిత్యం తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు.


చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నవారిని అనర్హులంటూ ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ద్రోహం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో పరిహారం దక్కని 471 రైతుల కుటుంబాలకు సీఏం వైఎస్‌ జగన్‌ రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు మంత్రి. ముందస్తుగా సాగు నీరిస్తుంటే క్రాప్‌ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నామని.. సాగు చేసే ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com