పేరులో ఏది అటు ఇటు అయినా అంతే సంగతులు. ఇది గమనించిన ఏపీ మహిళా మంత్రి అప్రమత్తమయ్యారు. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పేరులో స్వల్ప మార్పు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతవరకు కె.వి.ఉషశ్రీ చరణ్‌గా ఉన్న ఆమె పేరును కె.వి.ఉష శ్రీచరణ్‌గా మార్చారు. ఉష శ్రీచరణ్ మంత్రిగా నియామకం తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో ఆమె పేరును ‘ఉషశ్రీ చరణ్’గా ప్రస్తావిస్తున్నారు. కానీ తన పేరును సరిగా ‘ఉష శ్రీచరణ్’గా రికార్డుల్లో మార్చాలని గత నెల 2న సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. ఆమె పేరును మార్పు చేస్తూ ఉత్వర్వులతో జీవో 65ను జారీ చేశారు.
ఉష శ్రీచరణ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమెకు పదవి దక్కింది.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మంత్రి తన పేరును మార్పు చేసుకోవడానికి చాలా సమయం పట్టిందట.