ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు స్థాయలో నమోదయిన కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 02:57 PM

ఒక్కసారిగా దేశంలో కరోనా పంజా విసిరింది. ఏకంగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు.. గురువారం మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కొత్త కేసులు 145 రోజుల తర్వాత 20వేల మార్కును దాటాయి. తాజాగా 3.94 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే.. 20,139 మందికి పాజిటివ్‌గా నిర్థారించారు. ముందురోజుతో పోలిస్తే.. నాలుగువేల మేర అదనంగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 38 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.


మరోవైపు ఇక పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 4.36 కోట్ల మంది మహమ్మరి బారినపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 5,25,557కు చేరింది. యాక్టివ్ కేసులు 1,36,076కు లక్షలకు చేరగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.31 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.49 శాతానికి తగ్గింది. ఇక గత 24 గంటల వ్యవధిలో 16,482 మంది కరోనా నుంచి కోలుకొన్నారు.


ఇదిలా ఉంటే.. ఆరు నెలల తర్వాత యాంటీబాడీల స్థాయి తగ్గుతుందని ఐసీఎంఆర్‌, ఇతర సంస్థల అధ్యయనంలో తేలడంతో అప్రమత్తం అయ్యారు. బూస్టర్ డోసు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ నెల 15 నుంచి ఉచితంగా కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com