వరుణుడు కరుణించాలని, పంటలు బాగా పండాలని సాధారణంగా యజ్ఞ, యాగాలు చేస్తుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లాలో మాత్రం నగర పెద్దకు బురదతో స్నానం చేయిస్తారు. ఇలాచేస్తే ఇంద్రుడు తమ భక్తికి మెచ్చి వర్షాభావం లేకుండా దీవిస్తారని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా ను పిపార్డ్యూర్కు పిలిపించిన మహిళలు ఎమ్మెల్యే కు బురదతో స్నానం చేయించారు.