జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పడుతున్న వర్షాలు, వరదల మీద సమీక్ష నిర్వహించినట్లు , అలానే తగిన జాగర్తలు తీసుకొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవలసిన అవసరం ఉందని తెలియజేసినట్లు తెలుస్తుంది.