చంద్రబాబు నాయుడు హయాంలో పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, మా ప్రభుత్వం పలు సంస్కరణలు చేప్టటి, తత్ఫలితంగా మైనింగ్ శాఖకు దేశంలోనే మూడవ బెస్ట్ ర్యాంకు సాధిస్తే.. రాష్ట్రంలో కొండల్ని, చెరువులను తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరం అని వైసీపీ నాయకులూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చంద్రబాబు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే మీడియా ముందుకు రావడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రుషి కొండలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన ప్రకారమే అక్కడ మట్టి తవ్వకాలు జరిగాయి. ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్లు రాయిల్టీ కూడా చెల్లించింది. అసలు చంద్రబాబు రుషికొండ ఎందుకు పోవాల్సి వచ్చింది. రుషికొండలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ కోర్టుకు వెళ్లింది కూడా ఆయనే. రుషికొండలో నిబంధనల మేరకే పనులు జరిగాయి. నిర్దేశిత స్థలం కంటే ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిగాయన్న అంశం కోర్టు పరిధిలో ఉంది. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం చంద్రబాబు నాయుడు నైజం. రుషికొండపై గతంలో అక్రమాలకు పాల్పడివారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నాం అని తెలియజేసారు.