మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. వ్యాట్ తగ్గింపు ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే గురువారం తెలిపారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.33, డీజిల్ ధర రూ.97.26 గా ఉంది. తాజా నిర్ణయంతో ధరలు తగ్గనున్నాయి.