శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతూ అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలను ముట్టడించిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ముట్టడి చేయడంతో లంక అధ్యక్షుడు రాజపక్స దేశాన్ని వీడి పారిపోయారు. ప్రస్తుతం లంకలోని అధ్యక్ష, ప్రధాని భవనాలు నిరసనకారుల ఆధీనంలోనే ఉన్నాయి. తాజాగా నేడు ఆ భవనాల నుంచి వెళ్లిపోతున్నట్లు నిరసనకారులు వెల్లడించారు. కానీ నిరసనలు మాత్రం ఆపేది లేదన్నారు.