జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనకు పోలీసులు ఆటంకాలను కలిగిస్తున్నారని జనసేన పార్టీ మండిపడింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి మనోహర్ తో పాటు బయలుదేరిన నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంది. దీనికి నిరసనగా మనోహర్ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలను వదిలేశారని జనసేన పార్టీ గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.