టాంజానియాలో ఓ అంతుబట్టని అనారోగ్యం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. ఈ మిస్టరీ వ్యాధితో మరణించిన ముగ్గురు వ్యక్తులతో సహా, లిండి పట్టణ ఆగ్నేయ ప్రాంతంలో ఇప్పటివరకు 13కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఐఫెల్లో సిచల్వే తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే, రోగులకు జ్వరం, విపరీతమైన తలనొప్పి, ఆయాసం, ముఖ్యంగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నాయని నిపుణులు వెల్లడించారు.