టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. ఇటీవల విదేశాలకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స లాగానే చంద్రబాబు కూడా సింగపూర్ చెక్కేస్తారంటూ గురువారం ట్విట్టర్ వేదికగా విజయసాయి విమర్శించారు. 2024 తర్వాత సింగపూర్ వెళ్లిపోవడానికి చంద్రబాబు ప్రైవేట్ జెట్‌ను రెడీగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబును గొట్టం బాబు అంటూ ఎద్దేవా చేశారు.