స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, హెచ్సీఎల్ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. అలాగే రిలయన్స్, కొటక్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను చూశాయి. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన షేర్లు సాయంత్రం నష్టాలతో ముగిశాయి.