ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు ఉంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అల్లాడుతున్నారని గురువారం విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. గోదావరికి వరద రావడంతో 6 జిల్లాల్లోని 525కి పైగా గ్రామాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.